Tuesday, December 28, 2010

O..RANGE.......చెత్తగా కాకపోయినా కొత్తగా ఉంది .....

positive points మొదట చెప్పుకుందాము .

పాటలు ,sidney locations బావున్నాయి .....story లో కొన్ని practical గా ఉన్నాయి nice .....like ప్రేమ రోజు ఒకే లాగా ఉండదు ....IT DIFFERS IN QUALITY AND QUANTITY :))కానీ ఒక doubt మనం రోజు తినే తిండే ఒక రకంగా ఉండదు ప్రేమ దాకా ఎందుకు .......ఒక రోజు అన్నం చెత్త గా ఉందనొ ,సరిపోలేదనో ,for the rest of life అడ్డమైన గడ్డి కొంచం కొంచం తింటూ ఉండం కదండి.....ఇది అంతే...
ఈ చిన్న లాజిక్ ని ఎలా మిస్ అవుతామాబ్బా !!!!

anyways ఒక పాయంట్ మాత్రం deadly,ప్రేమ లో నిజాయితీ ఉండాలి అని,కానీ చిన్న సవరణ నిజాయితీ ఉండాల్సింది మనిషి లో... it should be there in every thing we think,do ,talk.....అలా అని మన director చెప్పినట్టు girlfriend తొ నువ్వు చెత్తగా ఉన్నావనో ,boyfriend తొ నువ్వు పరమ వెధవనొ పనికిమాలిన నిజాలు చెప్పక్కర్లే :))

ఇక heroine characterisation బావుంది ముఖ్యం గా slow transition from అమాయకమైన అల్లరి పిల్ల to ఖచ్చితమైన ఆడపిల్ల ....అంటె తొండ ముదిరి ఉసరవెల్లి అవడం బాగ చుపించాడు :)jenilia also did this well.


ఇక మన హీరొ బాగా చేసాడు....బావున్నాడు కూడా ...so ఇక accept చెయ్యక తప్పదు వాడిని కూడా హీరొ గా
మొత్తానికి సినిమా ఆలోచించెట్టు ఉంది కాని entertainment లేదు...

Sunday, November 7, 2010

తెల్ల చీర కట్టుకున్న మల్లెపువ్వంటి మనసే కదా మనోహరం






సరికొత్త చీర ఊహించినాను.... సరదాల సరిగంచు నేయించి నాను... మనసూ మమత....పడుగూ పేక చీరలో చిత్రించి నాను ఇది ఎన్నో కలల కలనేత....వన్నెల రాశికీ సిరి జోత......

ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు....ముళ్ళూ వాసన ఒక అందం ..అభిమానం గల ఆడపిల్లకు .....అలకా కులుకూ ఒక అందం
ఈ అందాలన్నీ కల బోస్తా....
నీ కొంగుకు చెంగున ముడి వేస్తా..:))

ఈ చీర బావుందా ????? design చెయ్యడం చాల easy


5 different colors benaras clothes ,white tassar saree మీద boarder లాగ ప్యాచ్ వర్క్ చెయ్యాలి ....and then diamond shape లో అదే బెనారస్ cloth తోటి thru out saree patches వెయ్యాలి.


blouse మీద అదే బెనారస్ cloth తోటి round patches thru out కూడితే ,designer blouse రెడీ ....

evening parties లో ఈ saree చాలా elegant గా ఉంటుంది .it goes well with simple one string pearl set...

Wednesday, October 13, 2010

KHALEJA

మరీ ఇంత expectations తట్టుకోలేకపోతున్న !!!!!
మహేష్ /త్రివిక్రం dialogue 100%correct......
ఎంత ౩ years తర్వాత వస్తే మాత్రం అంత expectations ఆ !!!!!మానవమాత్రుడు ఎవ్వరు ఆ expectations reach అవ్వలేరు ....but mahesh/trivikram done a nice job....if not decent...:)అంటే కొన్నిtrivikram type dialogues కాదు ...మన పూరి జగన్నాద్ type అన్నమాట...మీరు మరీను అన్ని విడమరిచి చెప్పం , అర్ధం చేసుకోవాలి ......మొత్తానికి ఒక జీవిత సత్యం అర్ధం అయింది.త్రివిక్రమ్ ముదిరితే పూరి జగన్నాథ్ ,మరీ ముదిరితే రాంగోపాల్ వర్మ అవుతారని. అమ్మో శేఖర్ కమ్ముల భయ్యాని జార్త గా ముదరకుండా కాపాడుకోవాలి .....లేకపోతే వెరైటీ ఉండదు సినిమాల్లో..
trivikram elevated other angle of mahesh....accept చెయ్యడానికి జనాలకి time పడుతోంది అంతే !!!

comedy తిన్నగా చెయ్యగలిగినవాడే ఖలేజ ఉన్న హీరో ....అసలు మహేష్ ఎంత బా చేసాడంటే ....standard comedians like సునీల్ ,బ్రహ్మానందం కంటే బాగానిపించింది...సినిమా లో ఒక డైలాగ్ ఉంది ..'ఇక్కడ కామెడీ చేస్తే ఎవరు చెయ్యాలి నేనే చెయ్యాలి ' అంటాడు మహేష్ అది కరెక్ట్ .....:))
ఇక మన జేజమ్మ అదే బొమ్మాలి గురించి మాట్లాడటానికి ఎం లేదు ...అది అనవసరం మన తింగరి ఇలియానా చాలు సుబ్బు character కి.పోనీలే height బావుంటుంది కదా..... ఇంకేమి చేస్తాం adjust అవుదాం .... iteam పాప లేదు ఏంటో? అది కూడా పెడితే..... పూరి జగాన్నదమయం అయ్యేది కదా ...మర్చిపోయి ఉంటాడు boss ..next time better luck..

ఇక మన నిజం హీరో త్రివిక్రమ్ గురించి చెప్పడానికి మాటలు లేవు.. what a defination for దేవుడు ...మనిషి లో నిస్వార్ధమే దేవుడు .fantastic.....concept ని substantiate చేసే scene లు బావున్నాయి.... కాకపోతే ఇది జనాలు recieve చేసుకోలేకపోతున్నారు ...హీరో 10 మందిని కొడితే దానికి reasoning అవసరం లేదు whistle వేయచ్చు ....కాని అదే కత్తి జారి villan చచ్చిపోయి ,దేవుడు వల్ల అంటే చీ!!!! reasoning లేదు మూఢ నమ్మకాలు తోక్కతోలు అనుకోవచ్చు విచ్చలవిడిగా ...ఏంటో బాబు ఈ జనాల బాధ .
పాటలు అన్ని 'అతడు' బాణీ లో ఉన్నాయ్ . కాని lyrics బావున్నాయి.

సినిమాలో connectivity missing అది మాత్రం draw back.
with all these its a enjoyable movie with standard trivikram punch lines and alltogether different mahesh .....

Saturday, October 2, 2010

బూరెలు


వివాహ బోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు అహః నాకె ముందు ,
ఈ పాట కి బురెలకి అవినాభావ సంబంధం ఉంది గా అందుకే పాడా......అంతెనమ్మ ఈ బూరెలు నేనే చేశాను ఎ వియ్యాలవారు చెయ్యాలే...కావాలంటే ఎలా చెయ్యాలో చెప్తా చుడండి .....

కావలిసినివి :
శనగపప్పు-1/4 kg
బెల్లం -200gms
బియ్యం-100gms
మినపప్పు -50gms

పూర్ణం చెయ్యడానికి శనగపప్పు కడిగి నీళ్ళు లేకుండా cooker లో ఉడకపెట్టుకుని mixy చెయ్యాలి ,
తర్వాత బెల్లం పాకం పట్టి దాంట్లో ఇదేసి గట్టి పడేదాకా తిప్పాలి .
బియ్యం ,మినపప్పు 1:2 ratio లో నానపెట్టి దోస పిండిల రుబ్బాలి తోపుకోసం .
పూర్ణం ఉండలు చేసి తోపులో ముంచి deep fry చెయ్యాలి .

Thursday, September 23, 2010

GANPATHI BAPPA MORYA

ये मेरा जहां ये मेरा घर मेरा आशियाँ
ये मेरी दुनिया तेरा काम क्या है यहाँ ......
అని పాడుకుంటూ నిమజ్జనానికి వెళ్ళిపోయా ....బోరున వర్షం పడుతుంటే ఎరుపు rain coat తగిలించుకుని .....nayak nahi khalnayak hu mai types లో రెచ్చిపోయి వెళ్ళా .....ఖైరతాబాద్ నుంచి tank bund వరకు నడిచుకుంటూ బోలెడు బొజ్జ గణపతుల్ని చూసుకుంటూ ....enjoyed, but tank bund మద్యలో చెప్పు కాస్తా పుటుక్కుమంది ....then problem started ......అయినా సరే అలాగే ఈడ్చుకుంటూ నడిచి మొత్తానికి నిమ్మజ్జనం చూసా:))) ...బావుంది .....హైదరాబాద్ లో వున్నా ప్రతి వాళ్ళు ఒక్కసారైనా చూసి ఎంజాయ్ చెయ్యాల్సిన విషయం ......పెద్ద గణపతులు నీళ్ళల్లో బుడుక్కుమని మునగడం ......బుజ్జి బుజ్జి గణపతుల్ని చిన్న చిన్న baby trolly లో తోసుకురవడం super .....అన్ని బావున్నాయి కాని అందరు కలసి ఒక group గా వెళ్తే ఇంకా enjoy చెయ్యచ్చు .....బూరాలు ఉదచ్చు,
డాన్సు లు చెయ్యచ్చు , ఎవరైనా మనకు నచ్చకపోతే ...ఒక టెంకి జెల్ల కొట్టి జనాల్లో కల్సి పోవచ్చు ....:)))).అబ్బో చాల చెయ్యచ్చు .....
అన్నట్టు వచ్చేటప్పుడు traffic jam లో దిగి చెప్పు కుట్టిచ్చుకుని మళ్లీ అదే బస్సు ఎక్కాను సుమీ !!!!!!

Thursday, September 9, 2010

eed mubarak


चाँद छुपा बदल में , शर्मा के मेरी जाना!!!!

నిజంగానే చందమామ అలిగి మబ్బుల్లో దాక్కున్నాడు బాబు ,అందుకే రాలే రంజాన్ పండగ . పోనీలే....
చందమామ రావే..జాబిల్లి రావే ..అని బుజ్జగించి...తీసుకొస్తాను గాని....ఈ sheer korma స్వీట్ ఎలా వుందో చుడండి ....అబ్బ భలేగా ఉంది కదా !!!!!
మరి ఈ హైదరాబాది పాయసం ఎలా చేస్తారో చూడండి.....

సన్న సేమియా :1/4 kg
పాలు :1 liter
పంచదార :250 gms
జీడిపప్పు :50gms
బాదాం పప్పు:50gms
చిరోంజి :2 spoons
దోస గింజలు :2 spoons
పిస్తా :50 gms
ఎండు ఖర్జూరాలు :6
ఎండు ద్రాక్ష :50 gms
milk maid :1/2 tin


బాదాం,పిస్తా ,జీడి పప్పు నీళ్ళల్లో నానపెట్టి 10 నిముషాలు ఉడికించి ,(బాదాం పొట్టు తీసి)అన్ని సన్నగా తరగాలి ,చిరోంజి నానేసి పొట్టు తీసి క్లీన్ చెయ్యాలి .ఇవన్ని నేతి లో వేరు వేరు గా వేయించుకొని
పక్కన పెట్టుకోవాలి .
సేమియా కూడా నేతి లో వేయించి పక్కన పెట్టుకోవాలి .
తర్వాత మిల్క్ మరగపెట్టాలి అవి సగం quantity అయ్యేవరుకు ...అంటే లీటర్ 1 /2 అవ్వాలి . అప్పుడు milk maid కలిపి సన్నటి సేగమీదే మరగనివ్వాలి ...
తర్వాత సేమియా వేసి ,పంచదార వేసి 5 నిమిషాలో stove off చెయ్యాలి ...serve చేసేటప్పుడు వేయించిన dry fruits వెయ్యాలి ....

మరెందుకు ఆలస్యం ....sheer korma చేసేసి రంజాన్ రోజు, మన బొజ్జ గణపయ్య కి పెట్టేద్దాం ....లొట్టలేసుకుంటూ తినేసి మనకు అడగక పోయిన బోలెడు వరాలు ఇచ్చేస్తాడు ....ఆ తర్వాత EESWAR ALLAH TERE NAAM ,SAB KO SANMATI DE BHAGWAN....
అని పాడదాము .... ఖసబ్ లకి వినపడేలా .....

Friday, September 3, 2010

నల్లవాడే ......అమ్మమ్మో అల్లరి పిల్లవాడే ......



జన్మాష్టమి రోజు మా ఇంట్లో చిన్నోడు....చటుక్కున ముద్దు పెట్టేసుకోవాలి అనిపించట్లే మా చిన్నోడిని చూస్తే ......వద్దమ్మ ......మా చంటోడు నలిగిపోతాడు ......
ముద్దుగా ఉన్నాడు కదా ......మరీ దిష్టి పెట్టదమ్మ .....
ఇలా పాట పాడండి చాలు .....

చేత వెన్న ముద్దా చెంగల్వ పూదండ

బంగారు మొలతాడు పట్టు దట్టి

సందె తాయతులు సరి మువ్వ గజ్జెలు

చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు ........

Friday, August 27, 2010

కురుల విరులలో,తళ్ళుక్కు మనిపించే చూడామణి అందాలు ......:)))




ఇవి జడలో పెట్టుకునే ,రకరకాల clips ,old fashion లా కనిపిస్తాయి , కాని ....ever green .....

చాల designs ఉంటాయీ .చూడామణి type ,నెమలి design లాంటివి .....

ఇవి పెట్టుకోవాలి అంటే ......ఓ ......పెద్ద జుట్టు ఉండక్కర్లే .ఏదో medium గా ఉంటె సరిపోతుంది .

ఇది పెట్టుకుని neat గా జడవేసుకుంటే ఆ అందమే వేరు!!!!!

చాల traditional గా , at same time trendy గా ఉంటాయి.
మరింకెందుకు late ......పెట్టేసుకోండి ....ఈ పాట పాడేసుకోండి....

నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి......

కురులు విరిసి మరులు కురిసి మురిసిన
రవి వర్మ చిత్ర లేఖన
లేఖ సరస సౌందర్య రేఖను శశిరేఖను......

పండగ చేసేసుకోండి పాపలు .....:))))

తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక




తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక
దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకా నా చాలింక ......


ఈ డ్రెస్ మీదవున్న తూనీగలని చూస్తే ఈ పాటే పాడాలనిపిస్తుంది కదూ!!!!! ......
ఈ dress టాప్.. supernet కోట మీద కలంకారి తూనీగలు patch work చేసి ,చమ్కి,కుందన్సు కుట్టారు .....ఇంకా neck pattern కలంకారి తో చేసారు.....

bottom కలంకారి చూడి pant .....


చున్ని sides కి కలంకారి patch వేసి, అక్కడక్కడ చమ్కి ఇంకా kundans కుట్టారు ....
delicate look తో చాల variety గా ఉందికదా !!!!!

Sunday, August 22, 2010

ఘళ్లు ఘళ్లు ఘళ్లు మంటు మెరుపల్లే తుళ్లు,ఝళ్లు ఝళ్లు ఝళ్లున ఉప్పొంగు నింగి వళ్లు




ఘళ్లు ఘళ్లు ఘళ్లు మంటు మెరుపల్లే తుళ్లు,ఝళ్లు ఝళ్లు ఝళ్లున ఉప్పొంగు నింగి వళ్లు,
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవె ఎరుగని వెగంతో వెళ్లు,..........లయకే నిలయమై నీపాదం సాగాలి......

పాటకంటే అందమైన గజ్జలు కదా ఇవి ..........వజ్రాలు పొదిగిన బంగారు పట్టీలు లాగా లేవు ...........కాని కాదుగా ,

ఇవి పంచాలోహలలో, రాళ్ళు పొదిగిన artificial పట్టీలు, ఎప్పుడు చూసినా వెండి పట్టీలు పెట్టి ,పెట్టి ,......మొహం మొత్తితే ,ఇది మంచి option ....

ఇవి saree మీద పెట్టుకుంటే .....'రావమ్మ మహాలక్ష్మి రావమ్మ' ......

chudi legs ఉన్న డ్రెస్ మీద పెట్టుకుంటే 'పదహారు అణాల....... తెలుగు అమ్మాయి .......తెలుగు అమ్మాయి '

:))

Saturday, August 21, 2010

జవనాల ఓ మథుబాలా... ఇవి జగడాలా ముద్దు పగడాలా



జవనాల ఓ మథుబాలా ...ఇవి జగడాలా ముద్దు పగడాలా..ఓరుగల్లుకె పిల్లా పిల్లా వెన్నుపూస ఘల్లుఘల్లుమన్నాదే ......ఓరచూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే .....

ఎందుకో ఈ పగడాల chain చూస్తే పాట గుర్తొస్తోంది ........
:)) బావుంది కదా !!!!
సింపుల్ corals with gold beads in between ......
సెంటర్ లో pendent కి బదులు 3 గోల్డ్ plated balls embedded with corals and emeralds చక్కగా సెట్ అయ్యాయి కదూ.....ఈ choker పగడాలు , simple sarees మీద హుందా గా, dresses మీద
అందంగా ఉంటాయి .....
ఇది gold లో కావాలంటే 6 -7 gms పడుతుంది ......but ఆ pendent గోల్డ్ plated లో కూడా ఉంటాయి ..around 600 rs cost ...safe and best ...
ఎప్పుడైనా ...ఎక్కడికైనా హాయిగా పెట్టేసుకోవచ్చు ....

Wednesday, August 18, 2010

శనగ వడలు




నాన పెట్టిన శనగలు : 1cup
పచ్చిమిర్చి :6
ఉల్లిపాయి :1
అల్లం
నానా పెట్టిన శనగలు ,పచ్చిమిర్చి రుబ్బుకోవాలి mixy లో .దాంట్లో ఉల్లిపాయి ముక్కలు ,కొత్తిమీర ,అల్లం ముక్కలు కలిపి , కావలిసిన shape లో చేసుకొని బాండి లో వేయించుకోవాలి .
ఇవి tomato sauce తో బావుంటాయి.వర్షాకాలం ఇలాంటివి చేసి పెడితే పిల్లలికి పండగే పండగ .....మరి ఇక ఆలస్యం ఎందుకు..... శ్రావణ మాసం పేరంటం శనగలు రెడీ ...వర్షాలు ఉండనే ఉన్నాయి....
enjoy

Sunday, August 15, 2010

బొప్పాయి కూర


బొప్పాయి తురుము : 1 cup
పచ్చిమిరపకాయలు :5
కరివేపాకు
కొత్తిమీర


పోపు వేసి దాంట్లో ,పచ్చిమిరపకాయలు ,బొప్పాసు కాయ తురుము వేసి ,మగ్గనివ్వాలి .
చిక్కటి చింతపండు పులుసు కొంచం వేసి మగ్గాక ,ఉప్పు ,పసుపు వేసి ఆపెయ్యాలి .
చల్లారాక ఆవ పెట్టాలి .
ఆవ :1 spoon ఆవాలు గంట నానపెట్టి రోటిలో ఉప్పు ,పసుపు ,ఒక ఎండు మిరపకాయి వేసి నూరుకోవాలి . అది కండర ఎక్కకుండా తొందరగా కూరలో కలిపెయ్యాలి ..

అంతే కూర ready ...ఇది కూర వడియాలతో బావుంటుంది

Monday, August 9, 2010

aishaaa

బోనాల్ పండగ రోజు పొద్దుపోద్దున్నే గోరింటాకు పెట్టుకుని ,గ్రీన్ కలర్ బట్టలు వేసుకుని
చక చకా నడుచుకుంటూ aisha అనే posh సినిమా కి వెళ్ళిపోయా.........
బానేవుంది .....
ఏదో హీరొయిన్ డ్రెస్సులు అవ్వి చూసుకోవచ్చు ......
hero,heroine మద్యలో dialogues super .....like she says "u will not even bend for tying shoelace"....ఎంత sarcasam ఉందొ ....
on d whole not 2 bad,as reviews.....:)))

Sunday, August 8, 2010

తెలంగాణాం .............

అసలు తెలంగాణ ఇస్తె నష్టం ఎంటొ నాకర్దం కావట్లె...ఏం పక్క రాష్ట్రా లొ ఉద్యొగాలు,వ్యాపారాలు చేసుకోరా??????ఇదెమన్న పాకిస్థానా అమ్మొ బతకలేం అనుకొడానికి......


ఒకవెళ ఎవడైన ఎమైనా అంటె ..... నీవాళ్ళు అనబడె తెలంగాణవాళ్ళు... చూస్తు ఉరుకోరు...చితకబాదతారు ...మనిషి కి మనిషికి మద్యలొ ఒక relation ఉంటుంది ...అది తెలంగాణా కంటె చాల గొప్పది....

అమ్మ 'ఇంట్లొ పాలు లేవు ' అంటె పక్కవీధి కెళ్ళి పాలు తెచ్చె తీరిక ఉండదుకాని...... తెలాంగాణా గురించి చచ్చిపోతారా!!!!!!! అసలు ఎ విషయం ప్రాణం కంటె గొప్పదికాదు .......... వాళ్ళు చిన్నపిల్లలు ,వాల్లని ఎగతోస్తున్న -చదువుండి ,సంస్కారం లేని దున్నపొతుల మాటెంటి ... ఎ శిక్ష సరిపొదు.వీళ్ళ కంటే ఆ ఖసబ్ నయం .......
పక్కవాడి ప్రాణం ఐతె ఉద్యమానికి పనికొస్తొంది ....వాడిసొంతప్రాణం మాత్రం పనికిరాదా .............

Saturday, August 7, 2010

పెసర అట్టు



పెసలు : 2గ్లాసులు

బియ్యం :1/2గ్లాసు

అల్లం చిన్న ముక్క

పచ్చిమిర్చి :10

ఉల్లిపాయలు :2

కొత్తిమీర :1కట్ట


పెసలు బియ్యం 6 గంటలు నానపెట్టి,మెత్తగా రుబ్బుకోవాలి .
ఒకగంట పాటు పిండిని పులవనివ్వాలి ,అప్పుడే పుల్లపుల్లగా బావుంటుంది :)) .
తర్వాత పెనం మీద అట్టు పల్చగా వేసి,దానిమీద ఉల్లిపాయీ,పచిమిర్చి,అల్లం ముక్కలు చల్లి సన్నటి సెగ మీద వెగనివ్వాలి,
అంతె పెసరట్టు READY ఇది వెన్నపూసలాంటి కొబ్బరి పచ్చడితొ గాని.... ఘటైన అల్లం పచ్చడి తొ గాని SUPERO SUPER:)))

Friday, July 23, 2010

నిజంకదా.............

OPPOSITE OF "LOVE"IS NOT "HATE"....ITS "INDIFFERENCE" ....

అంటె మన ఆర్య భాషలొ "ఎ feeling లెకపొవడం కంటె ఏదో ఒక feeling ఉండడం better !!!" ఈ విషయం ఎవరు అన్నారోగాని 'hats off' ....... నిజంగా చాల మహత్తరమైన జీవితసత్యం.....

Thursday, July 22, 2010

ప్రజాస్వామ్యం అంటె:-)

చిన్నప్పుడు ప్రజాస్వామ్యం అంటె "ప్రజలచె,ప్రజలకొరకు ఎన్నుకోపడిన ప్రభుత్యం "అని చదివినట్టు గుర్తు .


defination మారిందా కొంపతీసి....ఎందుకంటె మన రోసి తాత ని మనం ఎన్నుకోలె....మన్మొహన్ బాబు ని మనం కొరుకోలె....ఇద్దర్ని sonia అమ్మె పెట్టింది...ఇంతదానికి ప్రజాస్వామ్యం అని పేరెందుకో...... అమ్మ ఇష్ఠం అనిపెట్టచ్చుగా !!!
అసలు ప్రజలు సౌమ్యం గా పప్పు సుద్దల్ల ఉంటె అది ప్రజాస్వామ్యం అంటారేమో??
ఏంటో బాబు విషయంలొ clarity కరువైంది ..
కనీసం defination మారిస్తె బావుండు "అమ్మ చె, అమ్మ వలన,అమ్మకొరకు "అని :))

Thursday, July 8, 2010

గోంగుర పచ్చడి


కావలసినవి:

గోంగుర :4 కట్టలు

ఎండుమిరపకాయలు :10

పచ్చిమిర్చి :8

మెంతులు :1 spoon

ఆవాలు :1/2 spoon

జీలకర్ర :1/2 spoon

శనగపప్పు :1 spoon

మినపప్పు :1 spoon

వెల్లుల్లి :4 రేకులు

ఉల్లిపాయి :1

కారం :1 spoon

ఉప్పు :as per taste


1.గోంగుర ఒలిచి, కడిగి, ఆరపెట్టుకోవాలి.
2.మూకుడు లొ oil వేసి గోంగుర పచ్చిమిర్చి వేయించుకొవాలి
3.తరవాత శనగపప్పు,మినపప్పు,మెంతులు,ఆవాలు వేయించుకొవాలి
4.మొదట పప్పులు,మెంతులు ,ఆవాలు మెత్తగా grind చేసినతర్వాత గోంగుర కుడా grind చెయ్యాలి

పోపు :మూకుడులొ oil వేసి ఆవాలు, జీలకర్ర ,వెల్లుల్లి ,ఎండుమిర్చి,వెయించి దాంట్లొ ఎండుకారం వేసి పచ్చడిలొ కలపాలి ..... అంతె ...పచ్చడి ready



చల్ల అన్నం లో .... పచ్చి ఉల్లిపాయి తో భలె ఉంటుంది...........

Sunday, July 4, 2010

రాముడు రావణుడైతే ..... రావణుడు రాముడవుతాడా??????

ఎంటో ఈ మణిరత్నం సిధాంతం ....ఒక మనిషి ని మంచి అనడానికి..ఇంకొ మనిషి ని అంత చెడ్ద గా చుపించాలా???... అసలు చెడుని అంత కష్టపడి మంచిగా చుపించాల్సిన అవసరమేంటి??? అసలు రావణ్ సీత ని తీసుకురావడమే తప్పు. ఆ తర్వాత ఏంచేసాడు..ఎందుకు తెచ్చాడు..అనేది point కాదూ ... ప్రతి మనిషి తను చేసె పనికి i dont have an option అంటాడు..option లేకపొతే ఏ పనైన చెయ్యచ్చా..ఐతె ఏదో point of view లొ ఖసబ్ కుడా correct ఏమో!!!! క్షమించి hero ని చేద్దామా ??అసలు basic concept ఏ తప్పు ఇక movie లొ జీవం ఎలా ఉంటుంది......


ఇక creative direction లొ సుహసిని వేలు పెట్టకపోతె బావుండేదేమో బురద తప్పితె creativity కనిపించలె ....dubbing గోల లో dialogues అర్దం కాలె ....aish and raavan మద్యలొ ఇంకా మంచి dialogues ఉండచ్ఛు .....no జీవం in dialogues...

ఎమైనా బావుంది అంటె ప్రియమణి character...చాల బాగా చెసింది....
రెహమన్ music బావుంది but bad lyrics .....movie back ground music is nice...all together we do expect a better thing from mani.....nxt time better luck .....

Friday, July 2, 2010

BEET ROOT RAITHA


beet root chopped :1 cup
coconut (grated) :1 spoon
jeera powder :1 spoon(roasted)
mustard seeds :1/2 spoon
onion chopped :1
mashed garlic :4(cloves)
yogurt :1cup



heat oil in thavva splutter mustard seeds.add onions, garlicpaste,cook on low flame for 5 min then add coconut followed by beetroot,chilli powder,salt,jeera poweder.cook for 2 more min .. remove from flame then add yogurt...

Season with grated carrot,kothmeer...add glamour to it....:-)

with parota lajawab hai janab....

Thursday, July 1, 2010

కంద అట్టు



కంద గడ్డ ముక్కలు ఒక గ్లాస్
పెసరపప్పు ఒక గ్లాస్
బియ్యం పిడికెడు
పచ్చిమిర్చి
కొబ్బరి తురుము
జీలకర్ర
ఉప్పు

కంద కడిగి ముక్కలు చేసుకోవాలి ,పెసరపప్పు గంటన్నర నానపెట్టి అన్ని కలిపి రుబ్బుకోవాలి ..
పిండి ఒక గంట పులిసిన తర్వాత పెనం మీద అట్టు వేసి దోరగా కాల్చాలి ..........అట్టు రెడీ ....వాన కాలం రాత్రి
రసం తో అన్నం లో బావుంటుంది .

Tuesday, June 29, 2010

vedam review

post u r valuble opinions on vedam movie
best critic award wii b given 2 best one:-)

Saturday, June 5, 2010

వంట వార్పు



sorakayee parota












  • ingrediants:






  1. 1 cup grated louki



  2. 1 cup atta



  3. 1 big spoon jawari atta



  4. 4 green chillies



  5. 4 garlic cloves



  6. 1 tea spoon neembu juice



  7. 1/2 spoon garam masala powder



  8. 1/2 spoon kaali mirch



  9. 1/2 spoon turmeric powder



  10. 1/4 cup corriander



  11. 1 spoon ghee



mix all the ingrediants add salt to taste make a soft dough ,




roll them in desired shape fry in medium flame on thavva










Friday, June 4, 2010

RANANI RALENANI VURAKE ANTAVU RAVALANI ASALENIDE ENDUKU VASTHAVU:-))