चाँद छुपा बदल में , शर्मा के मेरी जाना!!!!
నిజంగానే చందమామ అలిగి మబ్బుల్లో దాక్కున్నాడు బాబు ,అందుకే రాలే రంజాన్ పండగ . పోనీలే....
చందమామ రావే..జాబిల్లి రావే ..అని బుజ్జగించి...తీసుకొస్తాను గాని....ఈ sheer korma స్వీట్ ఎలా వుందో చుడండి ....అబ్బ భలేగా ఉంది కదా !!!!!
మరి ఈ హైదరాబాది పాయసం ఎలా చేస్తారో చూడండి.....
సన్న సేమియా :1/4 kg
పాలు :1 liter
పంచదార :250 gms
జీడిపప్పు :50gms
బాదాం పప్పు:50gms
చిరోంజి :2 spoons
దోస గింజలు :2 spoons
పిస్తా :50 gms
ఎండు ఖర్జూరాలు :6
ఎండు ద్రాక్ష :50 gms
milk maid :1/2 tin
బాదాం,పిస్తా ,జీడి పప్పు నీళ్ళల్లో నానపెట్టి 10 నిముషాలు ఉడికించి ,(బాదాం పొట్టు తీసి)అన్ని సన్నగా తరగాలి ,చిరోంజి నానేసి పొట్టు తీసి క్లీన్ చెయ్యాలి .ఇవన్ని నేతి లో వేరు వేరు గా వేయించుకొని
పక్కన పెట్టుకోవాలి .
సేమియా కూడా నేతి లో వేయించి పక్కన పెట్టుకోవాలి .
తర్వాత మిల్క్ మరగపెట్టాలి అవి సగం quantity అయ్యేవరుకు ...అంటే లీటర్ 1 /2 అవ్వాలి . అప్పుడు milk maid కలిపి సన్నటి సేగమీదే మరగనివ్వాలి ...
తర్వాత సేమియా వేసి ,పంచదార వేసి 5 నిమిషాలో stove off చెయ్యాలి ...serve చేసేటప్పుడు వేయించిన dry fruits వెయ్యాలి ....
మరెందుకు ఆలస్యం ....sheer korma చేసేసి రంజాన్ రోజు, మన బొజ్జ గణపయ్య కి పెట్టేద్దాం ....లొట్టలేసుకుంటూ తినేసి మనకు అడగక పోయిన బోలెడు వరాలు ఇచ్చేస్తాడు ....ఆ తర్వాత EESWAR ALLAH TERE NAAM ,SAB KO SANMATI DE BHAGWAN....
అని పాడదాము .... ఖసబ్ లకి వినపడేలా .....
No comments:
Post a Comment