Wednesday, March 9, 2011

ప్రియమైన సోదర సోదరీమణులకు " HAPPY WOMEN'S DAY" :))

happy womens day అని విష్ చేసుకోడానికి ,కొత్త చీర కట్టుకోవాలి అనుకునేవరకు బానేవుంది ....అంతకు మించితేనే వింతగా ఉంది ....

నిన్న టీవీ9 లో womensday సందర్బంగా lady conductors కి ఒక రోజు సెలవు ప్రకటించిన RTC అని విన్నా...వెటకారం గా అనిపించింది.. అసలు మహిళలకి 33.33%resevation ,special ladies trains లాంటి concepts ..నాలాంటి ఆడ లేడీస్ కే.... ఏంటి ఈ ఆడ పేడ పురుగుల గోల అనిపిస్తాయి.. మగ చీడ పురుగులకి ఎంత మండుతుంది (ఏదో పేడ ...చీడ ..ప్రాస బావుందని వాడ ఏమనుకోకండే ...)

गुस्ताख़ी की माफ़.......

అసలు womens day ఏంటి dooms day లాగా...in what way a women is different from humanbeing ..??and humanist is different from feminist?? కొత్తగా మహిళా హక్కులు అంటున్నారు గాని ..అవి నిజానికి మానవ హక్కులే కదా!!


ఏంటి నీ సుత్తి గోల అంటారా ???.

ఏమీలేదు ...enjoy ur womenhood at every moment of life with heart and soul being a daughter,sister , mother, wife....and most basically good humanbeing .... then every day would be a 'great day' not just happy womens day...

FINALLY " HAPPY WOMEN'S DAY...OR MENS DAY(WHY NOT!!!) " TO ALL SUCH STRONG
INDIVIDUALS...

3 comments:

  1. Contrarily.............. http://intomyownworld.wordpress.com/2011/03/07/giving-voice-to-women/

    ReplyDelete
  2. ఎప్పటిలానే బావుంది మీ పోస్ట్. సృజనా పోస్ట్ కూడా చదివాను, అక్కడే కామెంట్ రాయాలి, కాని మీ బ్లాగ్ లో అయితే హ్యాపీ గా తెలుగులో రాసుకోవచ్చని ఇక్కడే రాస్తున్నా.
    మహిళా బిల్లు మీద నాకు పూర్తి స్థాయి అవగాహన లేదు కాని, ఇలా చట్ట సభల్లో రిజర్వేషన్స్ పెట్టుకుంటూ పొతే, ప్రజాస్వామ్యం అసలు లక్ష్యం మరుగున పడిపోతుందేమో. ఉదాహరణకి, నేను ఉన్న నియోజక వర్గం లో నేను పోటీ చేద్దామనుకున్నాననుకోండి, ఒకవేళ ఆ నియోజకవర్గం మహిళల కోటాలో ఉంటె, నేను పోటీ చెయ్యకూడదు, అది అన్యాయం కదా, నాకు నచ్చిన చోటు నుంచి పోటీ చేసే హక్కు నాకు ఉండాలి కదా..
    మరొక ఇబ్బంది, ఈ కోటాలు ప్రతీసారీ మారిపోతుంటాయి, అంటే ఈ సారి గెలిచిన/ఓడిన మహిళకి వచ్చేసారి టికెట్ దక్కుతుందని గారంటీ ఇవ్వలేం. స్థానిక సంస్థల్లో ఇప్పటికే ఈ పద్దతి ఉంది, దాని వల్ల ఏమైనా ఫలితాలు వచ్చాయో లేదో సమీక్షించుకోవాలి. ఈ కోటా పేరు చెప్పుకుని ఇప్పటికే రాజకీయాల్లో నాటుకుని ఉన్న పురుషులు, వాళ్ళ భార్యలకు సీట్లు తెప్పించుకుని, వాళ్ళే అజమాయిషీ చేస్తున్న కేసులూ చూస్తున్నాం. నిజంగా యోగ్యతా, ఆసక్తి ఉన్న మహిళలకి ఈ కోటా ఆసరా గా నిలిస్తే మంచిదే కాని, మాయావతులు, జయ లలితలు ఇంకా పుట్టుకొస్తే పెద్దగా ఒరిగేదేమీ లేదు అని నా అభిప్రాయం. మన సమాజానికి కావాల్సింది నిస్వార్థం గా పనిచేసే నాయకులు, వాళ్ళు పురుషులా.. స్త్రీలా.. అన్నది చూడకుండా, మనం నిజాయితీ గా మన ఓటు హక్కుని వినియోగించుకోవడం చాలా ముఖ్యం. ఏంటంటారు ?

    ReplyDelete
  3. A LEADER NEEDS NO RESERVATION...:)

    ReplyDelete