Friday, August 27, 2010

కురుల విరులలో,తళ్ళుక్కు మనిపించే చూడామణి అందాలు ......:)))




ఇవి జడలో పెట్టుకునే ,రకరకాల clips ,old fashion లా కనిపిస్తాయి , కాని ....ever green .....

చాల designs ఉంటాయీ .చూడామణి type ,నెమలి design లాంటివి .....

ఇవి పెట్టుకోవాలి అంటే ......ఓ ......పెద్ద జుట్టు ఉండక్కర్లే .ఏదో medium గా ఉంటె సరిపోతుంది .

ఇది పెట్టుకుని neat గా జడవేసుకుంటే ఆ అందమే వేరు!!!!!

చాల traditional గా , at same time trendy గా ఉంటాయి.
మరింకెందుకు late ......పెట్టేసుకోండి ....ఈ పాట పాడేసుకోండి....

నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి......

కురులు విరిసి మరులు కురిసి మురిసిన
రవి వర్మ చిత్ర లేఖన
లేఖ సరస సౌందర్య రేఖను శశిరేఖను......

పండగ చేసేసుకోండి పాపలు .....:))))

తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక




తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక
దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకా నా చాలింక ......


ఈ డ్రెస్ మీదవున్న తూనీగలని చూస్తే ఈ పాటే పాడాలనిపిస్తుంది కదూ!!!!! ......
ఈ dress టాప్.. supernet కోట మీద కలంకారి తూనీగలు patch work చేసి ,చమ్కి,కుందన్సు కుట్టారు .....ఇంకా neck pattern కలంకారి తో చేసారు.....

bottom కలంకారి చూడి pant .....


చున్ని sides కి కలంకారి patch వేసి, అక్కడక్కడ చమ్కి ఇంకా kundans కుట్టారు ....
delicate look తో చాల variety గా ఉందికదా !!!!!

Sunday, August 22, 2010

ఘళ్లు ఘళ్లు ఘళ్లు మంటు మెరుపల్లే తుళ్లు,ఝళ్లు ఝళ్లు ఝళ్లున ఉప్పొంగు నింగి వళ్లు




ఘళ్లు ఘళ్లు ఘళ్లు మంటు మెరుపల్లే తుళ్లు,ఝళ్లు ఝళ్లు ఝళ్లున ఉప్పొంగు నింగి వళ్లు,
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవె ఎరుగని వెగంతో వెళ్లు,..........లయకే నిలయమై నీపాదం సాగాలి......

పాటకంటే అందమైన గజ్జలు కదా ఇవి ..........వజ్రాలు పొదిగిన బంగారు పట్టీలు లాగా లేవు ...........కాని కాదుగా ,

ఇవి పంచాలోహలలో, రాళ్ళు పొదిగిన artificial పట్టీలు, ఎప్పుడు చూసినా వెండి పట్టీలు పెట్టి ,పెట్టి ,......మొహం మొత్తితే ,ఇది మంచి option ....

ఇవి saree మీద పెట్టుకుంటే .....'రావమ్మ మహాలక్ష్మి రావమ్మ' ......

chudi legs ఉన్న డ్రెస్ మీద పెట్టుకుంటే 'పదహారు అణాల....... తెలుగు అమ్మాయి .......తెలుగు అమ్మాయి '

:))

Saturday, August 21, 2010

జవనాల ఓ మథుబాలా... ఇవి జగడాలా ముద్దు పగడాలా



జవనాల ఓ మథుబాలా ...ఇవి జగడాలా ముద్దు పగడాలా..ఓరుగల్లుకె పిల్లా పిల్లా వెన్నుపూస ఘల్లుఘల్లుమన్నాదే ......ఓరచూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే .....

ఎందుకో ఈ పగడాల chain చూస్తే పాట గుర్తొస్తోంది ........
:)) బావుంది కదా !!!!
సింపుల్ corals with gold beads in between ......
సెంటర్ లో pendent కి బదులు 3 గోల్డ్ plated balls embedded with corals and emeralds చక్కగా సెట్ అయ్యాయి కదూ.....ఈ choker పగడాలు , simple sarees మీద హుందా గా, dresses మీద
అందంగా ఉంటాయి .....
ఇది gold లో కావాలంటే 6 -7 gms పడుతుంది ......but ఆ pendent గోల్డ్ plated లో కూడా ఉంటాయి ..around 600 rs cost ...safe and best ...
ఎప్పుడైనా ...ఎక్కడికైనా హాయిగా పెట్టేసుకోవచ్చు ....

Wednesday, August 18, 2010

శనగ వడలు




నాన పెట్టిన శనగలు : 1cup
పచ్చిమిర్చి :6
ఉల్లిపాయి :1
అల్లం
నానా పెట్టిన శనగలు ,పచ్చిమిర్చి రుబ్బుకోవాలి mixy లో .దాంట్లో ఉల్లిపాయి ముక్కలు ,కొత్తిమీర ,అల్లం ముక్కలు కలిపి , కావలిసిన shape లో చేసుకొని బాండి లో వేయించుకోవాలి .
ఇవి tomato sauce తో బావుంటాయి.వర్షాకాలం ఇలాంటివి చేసి పెడితే పిల్లలికి పండగే పండగ .....మరి ఇక ఆలస్యం ఎందుకు..... శ్రావణ మాసం పేరంటం శనగలు రెడీ ...వర్షాలు ఉండనే ఉన్నాయి....
enjoy

Sunday, August 15, 2010

బొప్పాయి కూర


బొప్పాయి తురుము : 1 cup
పచ్చిమిరపకాయలు :5
కరివేపాకు
కొత్తిమీర


పోపు వేసి దాంట్లో ,పచ్చిమిరపకాయలు ,బొప్పాసు కాయ తురుము వేసి ,మగ్గనివ్వాలి .
చిక్కటి చింతపండు పులుసు కొంచం వేసి మగ్గాక ,ఉప్పు ,పసుపు వేసి ఆపెయ్యాలి .
చల్లారాక ఆవ పెట్టాలి .
ఆవ :1 spoon ఆవాలు గంట నానపెట్టి రోటిలో ఉప్పు ,పసుపు ,ఒక ఎండు మిరపకాయి వేసి నూరుకోవాలి . అది కండర ఎక్కకుండా తొందరగా కూరలో కలిపెయ్యాలి ..

అంతే కూర ready ...ఇది కూర వడియాలతో బావుంటుంది

Monday, August 9, 2010

aishaaa

బోనాల్ పండగ రోజు పొద్దుపోద్దున్నే గోరింటాకు పెట్టుకుని ,గ్రీన్ కలర్ బట్టలు వేసుకుని
చక చకా నడుచుకుంటూ aisha అనే posh సినిమా కి వెళ్ళిపోయా.........
బానేవుంది .....
ఏదో హీరొయిన్ డ్రెస్సులు అవ్వి చూసుకోవచ్చు ......
hero,heroine మద్యలో dialogues super .....like she says "u will not even bend for tying shoelace"....ఎంత sarcasam ఉందొ ....
on d whole not 2 bad,as reviews.....:)))

Sunday, August 8, 2010

తెలంగాణాం .............

అసలు తెలంగాణ ఇస్తె నష్టం ఎంటొ నాకర్దం కావట్లె...ఏం పక్క రాష్ట్రా లొ ఉద్యొగాలు,వ్యాపారాలు చేసుకోరా??????ఇదెమన్న పాకిస్థానా అమ్మొ బతకలేం అనుకొడానికి......


ఒకవెళ ఎవడైన ఎమైనా అంటె ..... నీవాళ్ళు అనబడె తెలంగాణవాళ్ళు... చూస్తు ఉరుకోరు...చితకబాదతారు ...మనిషి కి మనిషికి మద్యలొ ఒక relation ఉంటుంది ...అది తెలంగాణా కంటె చాల గొప్పది....

అమ్మ 'ఇంట్లొ పాలు లేవు ' అంటె పక్కవీధి కెళ్ళి పాలు తెచ్చె తీరిక ఉండదుకాని...... తెలాంగాణా గురించి చచ్చిపోతారా!!!!!!! అసలు ఎ విషయం ప్రాణం కంటె గొప్పదికాదు .......... వాళ్ళు చిన్నపిల్లలు ,వాల్లని ఎగతోస్తున్న -చదువుండి ,సంస్కారం లేని దున్నపొతుల మాటెంటి ... ఎ శిక్ష సరిపొదు.వీళ్ళ కంటే ఆ ఖసబ్ నయం .......
పక్కవాడి ప్రాణం ఐతె ఉద్యమానికి పనికొస్తొంది ....వాడిసొంతప్రాణం మాత్రం పనికిరాదా .............

Saturday, August 7, 2010

పెసర అట్టు



పెసలు : 2గ్లాసులు

బియ్యం :1/2గ్లాసు

అల్లం చిన్న ముక్క

పచ్చిమిర్చి :10

ఉల్లిపాయలు :2

కొత్తిమీర :1కట్ట


పెసలు బియ్యం 6 గంటలు నానపెట్టి,మెత్తగా రుబ్బుకోవాలి .
ఒకగంట పాటు పిండిని పులవనివ్వాలి ,అప్పుడే పుల్లపుల్లగా బావుంటుంది :)) .
తర్వాత పెనం మీద అట్టు పల్చగా వేసి,దానిమీద ఉల్లిపాయీ,పచిమిర్చి,అల్లం ముక్కలు చల్లి సన్నటి సెగ మీద వెగనివ్వాలి,
అంతె పెసరట్టు READY ఇది వెన్నపూసలాంటి కొబ్బరి పచ్చడితొ గాని.... ఘటైన అల్లం పచ్చడి తొ గాని SUPERO SUPER:)))