Monday, June 27, 2011

అది నేనే ఆ చీర కట్టింది నేనే ...design చేసింది నేనే :)



ఈమధ్య ఒక అద్బుతమ్ జరిగింది what అంటే ???ఎలా చెప్పమంటారు,మరే నా జ్ఞాన బల్బ్ డింగ్ మని వెలిగిందోచ్....అదేంటి అంటే నాకు కూడా కళపోషణ ఉందని...మరి ఖాళీ ఎక్కువై అది ఇలా తన్నుకు బైటకివస్తుందని...

ఆ పైత్యమే ఈ చీర designing.....

మా తమ్ముడి భాషలో చెప్పాలంటే ...పని పాట లేని యవ్వారం.:)ఐనా వాడికి నేను ఏంచేసిన వెటకారమెలెండి..(దాన్నే అన్ని areas లో బలుపు అంటారులెండి)..వాడిమాటలు పట్టించుకోకండి మీరు flow లో follow అయిపోన్డి అంతే ...ఐనా ఎవరో చెప్పినట్టు remote కి tv లోకువ ....ఇలాంటి తొక్కలో తమ్ముల్లందరికి నాలాంటి అక్కలు లోకువ...ఐనా వాడిని తిట్టడం మొదలెడితే నా blog లో place సరిపోదు so క్షమించి వదిలేద్దాం ..(త్వరలో సూపర్ అక్కలు చింపిరి తమ్ముళ్ళు అని కొత్త blog start చేస్తా దాంట్లో చూసుకుందాం:)if any body is interested ...they r most welcome)


ఇక విషయానికి వస్తే ...ఈ చీర చాలా simple my dear ladies ...:)

ఒక plain చీర తీసుకుని దానిమీద రూపాయీ బిళ్ళ తో rounds మార్క్ చేసుకోవాలి,4 meters of the saree knee length,and rest of the saree completly fill with equidistant rounds .


then fill each round with contrast fabric color like blue on pink saree, stick mirror at the center of each round.enlighten each round and mirror with glitter..

simple contrast blouse will make it even more beautiful.

so go for it babes...అందమైన భామలు ....కాంచివరం చీరలు....

Tuesday, May 10, 2011

100% సోది చెప్తానమ్మ సోది!!!!:)

100% love చూసింతర్వాత తీన్మార్ i super likes నేను అసలే diplomatic ఇంతకంటే చెప్పలేను బాబు...

CONCEPT IS EVER GREEN AND NICE 'THE COST OF LOVE IS EGO'

కానీ ఇంత మంచి కాన్సెప్ట్ ని ఇంత వెటకారంగా తీశాడు ఏంటో సుకుమారన్న :) అసలు మన ఆర్య తీసింది ఈ సుకుమారేనా ఆని doubt వచ్చింది.. మన హీరొ కి action రాదు పోనీలే అనుకుంటే ....తమన్నా action ఎక్కువ చేస్తుంది ...అదేంటో thamanna నడిచిన action చేసినట్టు అనిపిస్తుంది మాష్టారు:)... చలాకీ - వెకిలితనానికి మద్యలో చిన్న demarcation ఉంటుంది..మార్చిపోతే ఎలా ??

పోనీ డ్రెస్ లు అవి చూసుకుందాం అంటే ..గొప్ప డ్రెస్ లు లేవు ఏదో last netted saree and kundan set తప్పితే .....ఆ saree carrying కూడా elegant గా లేదు. దారుణంగా disappointed ఈ విషయం లో ..సినిమాకీ ఎందుకు వెళ్తాం వీలైతే నాలుగు డ్రెస్లు కుదిరితే ఒక kundan set చూసి ఆనందిద్దాం అని కాదు...:)ఆ మాత్రం facility provide చెయ్యకపోతే ఎలా అధ్యక్షా!!!!:)నేను ఖండిస్తున్నా అంతే!!! హీరొ వాడిన bike super likes ..కానీ నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా:( అందుకే నాకు పనికి రాదు:)

పాటలు కూడా so so ..దేవీశ్రీ energy is missing some how...

కానీ కొన్నిచోట్ల ego clash between hero and heroine సున్నితంగా చాలా బాగా చూపించాడు liked it.చాలా obvious గా ఉంది:)
ఇక story line ...నాకు తెల్సి చదువు చెప్పేవాడిని వీడెక్కడ దొరికాడండి జడ్డి గాడు అనుకుంటారు , బండబూతులు తిట్టుకుంటారుకాని .....పొరపాటున కూడా లైన్ వెయ్యరు !!!!!:)

ఇహాపోతే ....చదువుకునే వాడికి అమ్మాయిలు పడిపోతార !!!!!wat a joke ha ha ha
బాగా చదువుకుంటే ,మంచి job వస్తుంది...మహా ఐతే పెళ్ళాం వస్తుంది, ఆది కూడా అమ్మ నాన్న సౌజన్యమ్ తో అంతే ...ఆ పెళ్ళాం తో తిన్నగా ఉండాలన్న talent ఉండాలి...చదువు కాదు...సర్లే నాకెందుకు బాబు ...మరి విమర్శించానంటే బుజ్జి ది పప్పు అనుకుంటారు ....అసలే నేను డైనమిక్...:)ఎవరు కుళ్ళు కున్నా :)))

anyways movie youth కి తెగ నచ్చింది ...bumper hit .....మీరు youth ఐతే no problem చూసెయ్యండి:))
నాకు సినిమా నచ్చింది బాబు..:) అసలే నేను యూత్ కదా!!!!!!:)

Friday, April 22, 2011

mr.perfect కాదు miss perfect/mr .common is correct

ఈ సినిమా చూశాక తీన్మార్ ఎందుకు నచ్చాలేదో అర్దం అయింది!!!! అంటే ఈ movie super likes అని కాదు:)

తీన్మార్ చూసినంత సేపు ఎప్పుడు hero,heroine complete గా breakup అవుతారా అని wait చేస్తాం ...ఈ మూవీ లో ఎప్పుడు కలుస్తారా అని wait చేస్తాం !!!!అది difference,ఈ కథ మనది ...అది ఇంతియాజ్ అలీ ది..ఎంత త్రివిక్రమ్ ఉన్నా work out కాలేదు.....basic sentiments దారుణంగా hurtings అమ్మ తీన్మార్ లో ...and mr.perfectలో మరీ ఎక్కువైంది sentiment dose ...oks ఇంకేం చేస్తాం adjust ఆవుదాం.:)

anyways normal విషయాలకి వస్తే ...

as usual heroine in mr. perfect is so chweeet:)her sarees are so nice,all are shimmer or benaras georgette with fine work,blouses are all mild designer ones.wah kya baath hai kaajal agarwal:)heroine charater perfectగా ఉంది hero character కంటే ..wat i mean to say is అబ్బాయిలందరు అలాగే ఏడుస్తారు no clarity ...కానీ అమ్మాయిల్లో kajals are rare..:) (నాకు నచ్చలెదనుకోండి ..నాకు మరి అంత మంచి ఆడపిల్లలన్నా ,బాగా ఇస్త్రీ చేసిన బట్టలు అన్నా మా చెడ్డ చిరాకు ..అలాంటివి handle with care వస్తువులు user friendly కాదు కదా:)

ఇక మన త్రిష dresses in teenmar,బట్టలు ఎక్కువ వేసుకోలేదు కాబట్టి చెప్పులు బాగా కనిపించాయి so వాటిగూరించి మాత్రమే మాట్లాడగలం:)anyways nice flats thru out the movie...పవన్ తో height problem అనుకుంటా పాపం(నేను సూపర్ height అని ఎవరో feelings అంట వాళ్ళకి మాత్రమే చెప్తున్నా...:))height వల్ల heels ఆలోచించి వేసుకోవాలి :)))

ఇక second heroine in తీన్మార్ పాపం బట్టలతో పాటు పువ్వులుకూడా మరి ఎక్కువ అయ్యాయి..మరీ head botanical garden లా ఉంది భరించడం కష్టం :)

ఇక మన హీరొ పవన్ ..... ఆ తింగరి character కి ఇంతకంటే better option దునియ లో లేదు ,అసలు జీవించేసాడు ..ఇటలీ లో మాట్లాడి నానా రకాల చేష్టలు చేసి తింగరితనానికి మారుపేరు గా ఉన్నాడు..anyways sincerly he is best of these nonsensical types..saif has to learn how to be nonsensical from pavan :)

ఇక మన darling ప్రభ గురించి నేను ఏమీ చెప్పలేను బాబు ఎందుకంటే బలవంతంగా నన్ను వాడి fan ని చేసేసారు జనాలు.....so బావున్నాడు బాగా చేశాడు అనే అనాలి..లేకపోతే జనాలు feelings అవుతారు

music is average in both..

on the whole mr .perfect is better option for weekend..have a nice weekend:)

Wednesday, April 20, 2011

లోక్ పాల్ బిల్ మార్చగలదా మనల్ని!!!ఉందా ఆ సత్తా?????

ఏదో సినెమాలు ....షికార్లు గురించి అంటే ok but....దీని గురించి detailed idea అంటే నాలాంటి bindaas బుజ్జి కి కష్టమే...కానీ ఇది latest fever అనుకుంటా,face book mania,orkutting లాగా ....జనాలు తెగ మాట్లాడుతున్నారు దీనిగురించి....మొన్న ఈ మద్య మా cousin లోక్ పాల్ అంటే తెలీదా నువ్వు అసలు indian వేనా అంది ,అంతే నేను అనుమానం /అవమానం feel అయ్యా బుడుగు గాడి లా!!...అంతే ..కశి గా follow అయిపోయా తెలిసిపొయిన్దొచ్.:))

ఇది చాలా simple గురూ :) లీడర్ సినిమా లో మన హీరొ చేసిన బిల్ ఇది,అంటే అక్కడ ప్రజాప్రతినిధులని ని exemptచేశాడు,ఇక్కడ prime minister ని కూడా spare చెయ్యరుట!!!concept బావుంది..no dout its powerfull..లేకపోతే ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలనీ ఇంత భయపెట్టలేదు...

కానీ ఒక dout ఎప్పడి నించో తన్నేస్తోంది మాస్టారూ ఫీల్ అవ్వకండి అడిగేస్తున్నా ...దీంట్లోంచి common man ని exempt చెయ్యలేదు కదా!!!!మరి మనం ఎందుకు భయపడటం లేదు??corruption అంటే లంచం తీసుకోవడమే కాదు....ఇవ్వడం కూడా కదా!!!
how many of us are ready for it sincerely?? mind u.... it starts from NO MORE BLACK TICKETS for the movie :)............to filing of income tax returns.


individual level లో లేని నిజాయతీ nation level లో how is it possible???

Saturday, March 19, 2011

ఏమాయ చేశావే....ఎందుకు మాయ చేసిందో ....ఎలా చెయ్య గలిగిందో మాత్రం నాకుclarity లేదు:)

ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతోంది అనుకుంటున్నారా ,మొన్న మా cousin నాకు చాలా నచ్చిన సినిమా అందని మళ్లీ చూసా....కానీ అదేంటో అంత చెప్పిన...నా అభిప్రాయం మాత్రం మారలేదు....

details లోకి వెళ్లే ముందు మన సమంత(not jessy character i am talking about) గురించి చెప్పాలి...SHE IS SO FRAGILE and her dressing is sober...chudidars are all simple mix and match with elegance. for that matter ...let it be dress ,saree, jeans ,skirt she carried it with grace.ఎంత నచ్చిందంటే కుందనపు బొమ్మ :)..ఇంక ఏ సినిమా చూడలేదు ఆ అమ్మాయిది...ఎందుకంటే ఆ ఫీలింగ్ పాడైపోతుందేమో అని :)


హీరొ ని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు ..ఎందుకంటే వాడిమీద నమ్మకం తో ఎవరు ఆ సినిమాకీ వెళ్లలేదు...పాపం ఈ విషయం తెలిసిపోయిన్నట్టు ఉంది వాడికి కూడా ,అందుకే action చేసి impressచెయ్యడానికి try చెయ్యలె..intelligent fellow:)

ఇక story విషయానికి వస్తే ....అసలు ఆ jessy ఏంటో!!!మాటామాట్లాడితే నేనేం చెయ్యను కార్తీక్ అనడమే సరిపోతుంది..కార్తీక్ సంగతి ఏమో కానీ నాకు మాత్రం' గంగ లో దూకుపో' అనాలనిపించింది:)నాకు తెలిసి ఈ కాలం అమ్మాయి లెవ్వరు అంత undetermined కాదు..ofcourse it doesnt mean that they r sincere, చెయ్యాలనుకున్న పనిలో clarity maintain చేస్తారు అంతే..:)

కానీ climax మాత్రం నా all time favourite...simply superb...ఏదో నాన్న చెప్పాడనో అమ్మమ్మ చెప్పిందనో ..ఏ కోన్ కిస్కాగొట్టం గాడికో commit అవ్వకపోవడం సూపర్ ... all the more హీరొ నించి కూడా ఏమీ expect చెయ్యదు...వాడి ఏడుపు ఏదో వాడిని ఏడవని అనుకుంటుంది ..ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా..she sincere to her ownself.

కానీ ఇక్కడ ఒక dout తన్నేస్తోంది ఎప్పడినించో...ఏంటంటే చివరాఖరిలొ వాళ్ళ నాన్న ని పట్టించుకోకుండా ఎందుకు పెళ్లి చేసుకుంటుంది ?ఒకవేళ అదే తన moto ఐతే అన్ని రోజులు ఎందుకు wait చేసింది... ఏంటో clarity missing...

ఇక పోతే music ఏ మాయ చేసాడండి...అబ్బాబ్బా...జాదూగాడండి బాబు...సినిమాని ఒక్కచేత్తో ఆడించాడంటే నమ్మండి!!!!!
మొత్తానికి movie c.d ఇంట్లో ఉంచుకుని అప్పుడప్పుడు సమంతని చూసుకోవచ్చు ...timepass...

Wednesday, March 9, 2011

ప్రియమైన సోదర సోదరీమణులకు " HAPPY WOMEN'S DAY" :))

happy womens day అని విష్ చేసుకోడానికి ,కొత్త చీర కట్టుకోవాలి అనుకునేవరకు బానేవుంది ....అంతకు మించితేనే వింతగా ఉంది ....

నిన్న టీవీ9 లో womensday సందర్బంగా lady conductors కి ఒక రోజు సెలవు ప్రకటించిన RTC అని విన్నా...వెటకారం గా అనిపించింది.. అసలు మహిళలకి 33.33%resevation ,special ladies trains లాంటి concepts ..నాలాంటి ఆడ లేడీస్ కే.... ఏంటి ఈ ఆడ పేడ పురుగుల గోల అనిపిస్తాయి.. మగ చీడ పురుగులకి ఎంత మండుతుంది (ఏదో పేడ ...చీడ ..ప్రాస బావుందని వాడ ఏమనుకోకండే ...)

गुस्ताख़ी की माफ़.......

అసలు womens day ఏంటి dooms day లాగా...in what way a women is different from humanbeing ..??and humanist is different from feminist?? కొత్తగా మహిళా హక్కులు అంటున్నారు గాని ..అవి నిజానికి మానవ హక్కులే కదా!!


ఏంటి నీ సుత్తి గోల అంటారా ???.

ఏమీలేదు ...enjoy ur womenhood at every moment of life with heart and soul being a daughter,sister , mother, wife....and most basically good humanbeing .... then every day would be a 'great day' not just happy womens day...

FINALLY " HAPPY WOMEN'S DAY...OR MENS DAY(WHY NOT!!!) " TO ALL SUCH STRONG
INDIVIDUALS...

Saturday, February 26, 2011

అలా మొదలైంది .....ఇలా నచ్చేసింది ఓచ్!!!!

సినిమా సూపర్ ............
గత ఏడాది గా వచ్చిన మూవీస్ లో ఇది బావుంది ...

story ఏమీ లేదు ..... అలా కలిసామా ...ఇలా విడిపోయామ !!!....మళ్లీ కలిసామా అంతే .....కానీ బావుంది.....విషయం లేకుండా ౩ గంటలు ప్రేక్షకులని entertain చెయ్యగలగడం కష్టం ....in that way director is talented.:)).ఐనా ఇప్పుడు మనం కోరుకునేది ఇదే కదా!!!సినిమా చూశామా,popcorn తిన్నమా వచ్చామా.. so no regrets ...


heroine సౌందర్య లాగా ఉంది..చాలా బాగా చేసింది కూడా,body language super....అంతే కాదు చాలా simple గా పక్కింటి అమ్మాయి character లాగా ఉంది .


ఉష్ .............!!!ఎవ్వరికీ చెప్పనంటే ఒక మాట చెప్తా...మరే మొహమాటం వేస్తోంది కానీ... heroine character చూస్తే అదేంటో నన్ను నేను చూసుకున్నట్టు ముచ్చటగా ఉంది అనుకోండి.:)).ముఖ్యంగా when she is fighting ..:))

hero ok.....last లో వాడి love expression కి దిమ్మతిరిగి mind block అయ్యింది...:)))... dialogues superrrr....

ఇక పూరీ జగన్నాద్ inspiration తో last లో software engineers మీద contemporary జోక్ లు అబ్బాబ్బా....పొట్టపట్టుకు నవ్వాను....అంటే నాకు కొంచం మొహమాటం తక్కువ ఈ విషయం లో ...సినిమా లో జోక్ ల కి పక్క వాళ్ళు ఏమనుకుంటారు ,popcorn ఒలికిపోతోందా .....అని చూడను .....:))for this always my cousins tease me.:))


ON THE WHOLE NICE TIME PASS FOR D WEEK END....DONT MISS IT...

Saturday, February 5, 2011

our autograph..... sweet memmories..



గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతుల్లొ ఏ మూలల్లొ నిదురించు జ్ఞాపకాలు........ గుర్తుకొస్తున్నాయి ...

గుర్తుపట్టారా దీన్ని ...చిన్నప్పుడు మనం ఊగిన వనంపల్లి ఉయ్యాల ....ఇప్పుడు బొజ్జి గాడి crib గా మారింది :)
దీనితో ప్రతిఒక్కరికీ ఏదో ఒక memmory ఉండేవుంటుంది ....mine is this....enjoyit...

చిన్నప్పుడు వనంపల్లి వెళ్లినప్పుడు మా తొట్టి గ్యాంగ్ అంత ఈ ఉయ్యాలలో బస్ ఆట ఆడుకునే వాళ్ళం .
దానికి కండక్టర్ కమ్ డ్రైవర్ అందరివాడు (అదే మా చిన్న అన్న ).


వాడు ఊరి పేరు చెప్పి whistle ఏస్తే ,passenger లు దిగాలి,మా ఊరి పేరు పిడుగురాళ్ల కానీ మా తమ్ముడు ఉన్నాడు చూడండి.....అబ్బాబ్బా... నా ప్రాణానికి ప్రతి స్టాప్ లో ఉయ్యాల దుకేసేవాడు ...నేను "ఒలేయ్ వెధవా ఇది మన ఊలు కాదులా,దిగకూలదు లా"అని చెయ్యపట్టుకు ఆపే దాన్ని...కానీ funny thing ఏంటంటే ,ఆ టెన్షన్ లో అసలు మా పిడుగురాళ్ల స్టాప్ వచిన్నప్పుడు కూడా దిగే దాన్ని కాదు దిగనిచ్చేదాన్ని కాదు...హహా హహా!!